తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జీ-7' ప్రత్యేక అతిథిగా ఫ్రాన్స్ చేరుకున్న మోదీ.

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. బియారిట్జ్​లో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొననున్నారు. అగ్ర దేశ అధినేతలలో సమావేశం కానున్నారు.

'జీ-7' ప్రత్యేక అతిథిగా ఫ్రాన్స్ చేరుకున్న మోదీ.

By

Published : Aug 25, 2019, 9:53 PM IST

Updated : Sep 28, 2019, 6:32 AM IST

బహ్రెయిన్‌లో పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్‌ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బియారిట్జ్​లో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. వాతావరణ మార్పులు, డిజిటల్​ ట్రాన్స్​ఫర్మేషన్​ వంటి కీలక అంతర్జాతీయ అంశాలపై అగ్రదేశాధినేతల సమావేశంలో ప్రసంగించనున్నారు మోదీ.

జీ-7లో భారత్​ సభ్యదేశం కానప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్​ ప్రత్యేక ఆహ్వానం మేరకు సదస్సుకు హాజరవుతున్నారు మోదీ.

'జీ-7' ప్రత్యేక అతిథిగా ఫ్రాన్స్ చేరుకున్న మోదీ.

ఈ సందర్భంగా జీ-7 సభ్య దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమై భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. భారత్‌లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని, తమ వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని ట్రంప్‌ కోరనున్నట్టు తెలుస్తోంది. వీరి భేటీలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. భారత్​-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా మోదీతో చర్చలు జరపుతానని ఈ వారమే ట్రంప్​ ప్రకటించారు.

ఊహించని అతిథిగా ఇరాన్​ విదేశాంగ మంత్రి

జీ-7 సదస్సుకు ఎవరూ ఊహించని అతిథిగా వచ్చారు ఇరాన్​ విదేశాంగ మంత్రి మహమ్మద్​ జావెద్​ జరీఫ్. తెహ్రీన్​లో వివాదాస్పద అణు కార్యకలాపాలతో ఆ దేశంతో దౌత్యసంబంధాలపై ఆంక్షల అంశాన్ని లేవనెత్తేందుకే వచ్చి ఉంటారని సమాచారం. జరీఫ్ వస్తారని ఎవరికీ తెలియదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఇరాన్​- అమెరికా మధ్య చర్చలు జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసి ఉంటారని ఇతర దేశాల ప్రతినిధులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:బంగాల్​లో వామపక్షాలతో కాంగ్రెస్​ దోస్తి..!

Last Updated : Sep 28, 2019, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details