గురునానక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమ్మిళిత, సామరస్యపూర్వక సమాజం నిర్మించాలన్న గరునానక్ కలల్ని దేశప్రజలు కలిసి నెరవేర్చాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
"గురునానక్ 550వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. గురునానక్ కలగన్న సమ్మిళిత, సామరస్య సమాజం నిర్మించడానికి ప్రజలందరూ కలిసి తోడ్పడాలి. ఆయన కలల్ని మనమందరం సాకారం చేయాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
గురునానక్ జయంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"సిక్కు మత గురువు గురునానక్ దేవ్‌జీ.. భారతదేశంలో సాధువు సంప్రదాయానికి ప్రత్యేకమైన చిహ్నంగా నిలిచారు. ఆయన ఆలోచనలు, బోధనలు, ప్రజాసేవ చేయాలనే సంకల్పం మనకు ప్రేరణ ఇస్తాయి. చారిత్రక కర్తార్‌పుర్ నడవాను మోదీ ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేసి గురునానక్‌కు హృదయపూర్వక నివాళి అర్పించారు. మోదీ ప్రభుత్వం.. గురునానక్ ఆలోచనలను, బోధనలను గౌరవిస్తుంది. సబకా సాత్- సబకా వికాస్ మా ప్రధాన నినాదం."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
గురునానక్ జయంతిని వైభవంగా జరుపుకొనేందుకు వందలాది మంది భక్తులు గురుద్వారాలకు తరలివెళ్తున్నారు.
ఇదీ చూడండి : ఆకతాయి దెయ్యాల 'సరదా' తీర్చిన పోలీసులు