తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారానికి విజ్ఞప్తి

అయోధ్య కేసులో రోజువారీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరుతూ సుప్రీంలో వ్యాజ్యం దాఖలయింది. ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతకర్త కేఎన్​ గోవింద్ ​ఆచార్య వేసిన ఈ పిటిషన్​పై అత్యవసర విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

అయోధ్య

By

Published : Aug 5, 2019, 4:46 PM IST

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో రోజువారీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీం కోర్టులో ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతకర్త కేఎన్​ గోవింద్​ఆచార్య వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై అత్యవసరంగా విచారణ కోరారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారిస్తామని కోర్టు తెలిపింది.

పిటిషన్​ను పరిశీలించిన సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్​ ఎస్​ఏ బాబ్దే, జస్టిస్ బీఆర్​ గవాయితో కూడిన ధర్మాసనం... అత్యవసర విచారణకు నిరాకరించింది. ఇది న్యాయస్థానం పాలనాపరంగా తీసుకునే నిర్ణయమని తెలిపింది. ఈ విషయమై చర్చ అవసరమని అభిప్రాయపడింది. వీడియో రికార్డు చేసేందుకు తమ వద్ద పరికరాలు ఉన్నాయో లేదో తెలియదని పేర్కొంది.

ప్రత్యక్ష ప్రసారానికి ఇబ్బందులు ఉంటే కనీసంగా విచారణను వీడియో రికార్డు చేయాలని ఆచార్య తరఫు న్యాయవాది వికాస్ సింగ్​ కోరారు. ముఖ్యమైన కేసుల్లో ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని గతేడాది సుప్రీం ఇచ్చిన తీర్పును సింగ్ ప్రస్తావించారు.

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వ కమిటీ జులై 31న సమర్పించిన నివేదికపై ఆగస్టు 2న సుప్రీం విచారణ చేపట్టింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో మంగళవారం నుంచి రోజువారీ విచారణ కొనసాగిస్తామని తెలిపింది.

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

ABOUT THE AUTHOR

...view details