తీవ్రమైన నేరారోపణలు ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ దీన్ని సమర్పించారు. త్వరలో ఇది విచారణకు రానుంది. గతంలో నేరగాళ్లు ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించి డబ్బులు తీసుకునేవారని, ఇప్పుడు మాత్రం ఏకంగా అభ్యర్థులుగా ఉంటున్నారని పేర్కొన్నారు. నిధులను కూడా వారే సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రభావం పెరిగిన ప్రస్తుత తరుణంలో అలాంటివారు గెలిచే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని ఆ వ్యాజ్యంలో ప్రస్తావించారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఉన్న పార్టీలు కూడా వారిని చేర్చుకుంటున్నాయని ఆరోపించారు. అందువల్ల మంచివారిని ఎన్నుకొనే అవకాశం ఓటర్లకు ఉండడం లేదని తెలిపారు. రాజకీయాలు నేరమయం కాకుండా చూడాలని కోరారు.
తీవ్ర నేరారోపణలు ఉన్న నేతలపై సుప్రీంలో వ్యాజ్యం
నేర చరిత్ర గల రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయడంపై న్యాయవాది అశ్విన్ కుమార్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని కోరారు. ఈ పిల్ త్వరలోనే విచారణకు రానుంది.
తీవ్ర నేరారోపణలు ఉన్నవారిపై సుప్రీంలో వ్యాజ్యం
వ్యాజ్యంలో మరిన్ని అంశాలు
- ఎన్నికల సంస్కరణలపై 1974లో జయప్రకాశ్ నారాయణ్ కమిటీ, 1990లో గోస్వామి కమిటీ, 1993లో వోహ్రా కమిటీలు సిఫార్సులు చేశాయి. నేరరహిత రాజకీయాలపై 2014లో లా కమిషన్ నివేదిక ఇచ్చింది. 2016లో ఎన్నికల సంఘమే పలు సూచనలు చేసింది. రాజకీయాల్లో నేరచరితుల వల్ల భారత ప్రజాస్వామ్య రక్షణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని 2018లో సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. వీటిని కేంద్రం అమలు చేయడం లేదు.
- 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన539 మందిలో 43% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన వారిలో అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు తదితర తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు 159 (29 శాతం) మంది ప్రకటించారు.
- 2014 ఎన్నికల్లో గెలిచిన 542 మందిలో 34 శాతం (185) మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు తదితర తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు 112 మంది ప్రకటించారు.
- 2009లో ఒక ఎంపీపై ఏకంగా 204 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి:-ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు