అద్భుత కట్టడాలకు నిలయమైన జైపుర్ నగరానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు కల్పించింది యునెస్కో. అజెర్బైజాన్లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ 43వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో జైపుర్ స్మారక చిహ్నాలు, ప్రాంతాల అంతర్జాతీయ మండలి (ఐసీఓఎమ్ఓఎస్) 2018లో జైపుర్ నగరంలో పర్యటించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రధాని హర్షం..
జైపుర్‌కు వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో జైపుర్ " జైపుర్ సంస్కృతి, వీరత్వం కలగలిపిన నగరం. జైపుర్ ఆతిథ్యం ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తించటం సంతోషకరం. "
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: ప్రపంచ వారసత్వ జాబితాలో హిర్కానియన్, వత్నాజోకుల్