ఐఏఎఫ్ పైలట్‌ను వాఘా సరిహద్దుల నుంచి స్వదేశానికి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలపై గురువారం నిర్వహించిన పాకిస్థాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ.. శాంతిని కాంక్షిస్తూ, సంప్రదింపుల కోసం తొలి అడుగుగా భారత పైలట్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏ సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదని, ఉద్రిక్తతల్ని పెంచొద్దని భారత నాయకత్వాన్ని కోరారు.
భారత పైలట్‌ను బేషరుతుగా విడుదల చేయాలని ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని భారత్ గట్టిగా డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకుంది.
భారత వాయుసేన సైనికుడి విడుదలను భారత్, అమెరికా సహా పలు దేశాలు స్వాగతించాయి. వింగ్ కమాండర్‌ను పాక్ భారత్‌కు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేయడంపై ఐక్యరాజ్యసమితి హర్షం వ్యక్తం చేసింది.