వైద్య విద్యలో కీలక సంస్కరణల దిశగా 15వ ఆర్థిక సంఘం పరిధిలోని ఉన్నతస్థాయి కమిటీ పలు సిఫార్సులు చేసింది. ‘ఎయిమ్స్-దిల్లీ’ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ వివిధ అంశాలపై అధ్యయనం చేసి సూచనలు చేసింది. ఎంబీబీఎస్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయో, పీజీలోనూ అన్నే సీట్లు ఉండాలన్నది ఇందులో ప్రధానమైనది. ఈ సిఫార్సు అమలయితే రానున్న ఐదేళ్లలో ఎంబీబీఎస్, పీజీ సీట్లు సరిసమానం కానున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 80వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, పీజీ సీట్లు మాత్రం అందులో మూడో వంతు మాత్రమే ఉన్నాయి. తాజా సిఫార్సు ప్రకారం 2025 నాటికి వైద్య విద్యలో డిగ్రీ, పీజీ సీట్ల సంఖ్య సమానం కానుంది.
ఎంబీబీఎస్ సీట్లు ఎన్నో.. పీజీలోనూ అన్నే - pg seats to equal mbbs seats
ఎంబీబీఎస్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయో, పీజీలోనూ అన్నే సీట్లు ఉండాలన్న 15వ ఆర్థిక సంఘం పరిధిలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు అమలైతే రానున్న ఐదేళ్లలో ఎంబీబీఎస్, పీజీ సీట్లు సరిసమానం కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. అందులో మూడొంతులు మాత్రమే పీజీ సీట్లున్నాయి.
ఎంబీబీఎస్ సీట్లు ఎన్నో పీజీలోనూ అన్నే
మరికొన్ని సిఫార్సులు..
- ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లోనూ మార్పులు చేయాలి. విద్యార్థుల సమర్థత ఆధారిత కోర్సులు ఉండాలి. అందులో భాగంగా ఎంబీబీఎస్ స్థాయిలోనే కొద్దిపాటి స్పెషలైజేషన్‌కు వీలుండాలి.
- వెల్‌నెస్ క్లినిక్‌లు, ప్రాథమిక సర్జరీలు, మత్తు ఇవ్వడం, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, నేత్ర వ్యాధులు, ఈఎన్‌టీ తదితర అంశాల్లో స్వల్పకాలిక కోర్సులు ఉండాలి.
- వైద్య కళాశాలలు లేనప్పటికీ ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీజీ డాక్టర్లు శిక్షణ పొందే అవకాశం కల్పించాలి.
- వైద్య కళాశాలలు బోధన, పరిశోధనకు ఉద్దేశించినందున అక్కడ అధ్యాపకులుగా పనిచేసేవారు ప్రైవేటుప్రాక్టీసు చేయకుండా నిషేధించాలి.
Last Updated : Feb 18, 2020, 5:02 AM IST