తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో టీకా అత్యవసర వినియోగానికి ఫైజర్ దరఖాస్తు - pfizer in britan

భారత్​లో తమ టీకాను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు పెట్టుకుంది ఫైజర్​ సంస్థ. నూతన డ్రగ్స్​, క్లినికల్​ ట్రయల్స్​ 2019 నిబంధనల ప్రకారం టీకాకు క్లినికల్​ ట్రయల్స్​ను మాఫీ చేయాలని కోరుతోంది. ఈ టీకా అత్యవసర వినియోగానికి యూకే, బహ్రెయిన్ దేశాలు ఇప్పటికే అనుమతిచ్చాయి.

Pfizer seeks emergency use authorisation for its COVID-19 vaccine in India
మా టీకాను భారత్​లో అనుమతించండి: ఫైజర్​

By

Published : Dec 6, 2020, 5:47 AM IST

కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ దేశంలో తొలి దరఖాస్తు నమోదైంది. తమ వ్యాక్సిన్​ను అనుమతించాలని ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ ఇండియా.. భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది. మాతృసంస్థ ఫైజర్‌ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికై యూకే, బహ్రెయిన్ అనుమతించిన నేపథ్యంలో ఫైజర్‌ ఇండియా డీసీజీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల నాలుగో తేదీన దరఖాస్తు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

న్యూ డ్రగ్స్‌ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019లోని ప్రత్యేక నిబంధనల ప్రకారం భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ మాఫీ సహా టీకా అమ్మకం, సరఫరాకోసం వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు అనుమతివ్వాలని దరఖాస్తులో ఫైజర్ ఇండియా కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఫైజర్- బయో ఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేశాయి. టీకా అత్యవసర వినియోగానికి యూకే, బహ్రెయిన్ దేశాలు ఇప్పటికే అనుమతించాయి. అయితే మైనస్ 70 డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి రావడం టీకా సరఫరాలో సవాల్‌గా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details