అపాయం నుంచి ఇంటి యజమానురాలిని కాపాడి.. విశ్వాసం చాటుకుందో పెంపుడు శునకం. మహిళపై లైంగిక దాడి చేసే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని పసిగట్టి పదే పదే బిగ్గరగా అరుస్తూ పట్టించింది. ముంబయిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని పొవాయ్ ప్రాంతంలో 33 ఏళ్ల మహిళ తన ఏడేళ్ల కూతురితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె ఓ శునకాన్ని పెంచుకుటున్నారు. ఇటీవలే ఆమె భర్త మరణించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే సర్దార్ ఆలం అనే 25 ఏళ్ల వ్యక్తి.. మహిళతో స్నేహానికి ప్రయత్నించగా ఆమె తిరస్కరించారు. ఆమెపై కక్ష పెట్టుకున్న నిందితుడు లైంగిక దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.