మహిళా ఉద్యోగులకు నెలకు నాలుగు రోజులపాటు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్స్ ఇవ్వాలంటూ దిల్లీ లేబర్ యూనియన్ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు విచారించింది. దీనిపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది.
'నెలకు నాలుగురోజుల పీరియడ్ లీవ్స్‌పై స్పందించండి' - 'నెలకు నాలుగురోజుల పీరియడ్ లీవ్స్‌పై స్పందించండి'
మహిళా ఉద్యోగులకు నెలకు నాలుగు రోజులు వేతనంతో కూడిన రుతుక్రమం సెలవులను ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు విచారించింది. దీనిపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
మహిళల గౌరవానికి సంబంధించి చట్టంలోని నియమనిబంధనలు, ప్రభుత్వ పాలసీలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీఎన్.పాటిల్, జస్టీస్ ప్రతీక్ జలాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
దిల్లీ లేబర్ యూనియన్ తరఫున పిటిషన్‌ను అడ్వకేట్ రాజీవ్ అగర్వాల్ దిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. 'అన్ని తరగతుల మహిళా ఉద్యోగులు, సిబ్బంది, రోజూవారీ కూలీలు, ఒప్పంద ఉద్యోగులకు నెలకు నాలుగు రోజులు వేతనంతో కూడిన రుతుక్రమం సెలవులు ఇవ్వాలని, ఒకవేళ మహిళలు పీరియడ్స్ సమయంలోనూ విధులు నిర్వహిస్తే వారికి అదనపు వేతనం అందించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక రుతుక్రమం సమయంలో మహిళలకు టాయిలెట్స్, విశ్రాంతి గదులు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. శానిటరీ ప్యాడ్స్‌ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇది మహిళల గౌరవానికి సంబంధించిన అంశమని పిటిషన్లో వివరించారు.