తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ విషయం పవారే నేర్పారు: ఉద్ధవ్​ - shivasena latest news

అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు సాధించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయొచ్చో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ తనకు నేర్పించారని పేర్కొన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. తక్కువ పరిధిలో ఏ విధంగా ఎదగాలో చెప్పారని వెల్లడించారు. పుణెలోని వసంత్​దాదా సుగర్​ ఇన్​స్టిట్యూట్​లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​పై విమర్శలు గుప్పించారు.

Uddhav
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే

By

Published : Dec 26, 2019, 5:03 AM IST

Updated : Dec 26, 2019, 7:24 AM IST

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్​ ఠాక్రే కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్​-ఎన్సీపీతో చేతులు కలిపి అధికారాన్ని చేజిక్కించుకున్న శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ పరిధి నుంచి ఎలా ఎదగాలి, ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉన్నా ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది శరద్​ పవార్​ నేర్పించారని పేర్కొన్నారు.

పుణెలోని వసంత్​దాదా సుగర్​ ఇన్​స్టిట్యూట్​ వార్షిక సాధారణ సమావేశానికి హాజరైన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఠాక్రే. అత్యధిక స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించిందన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా అధికారాన్ని చేపట్టలేకపోయారని ఎద్దేవా చేశారు ఠాక్రే.

మోదీపై వ్యంగ్యస్త్రాలు..

కొన్ని సంవత్సరాల క్రితం ఇదే సంస్థ ప్రాంగణంలో అప్పటి గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ.. శరద్​ పవార్​ వేలు పట్టుకునే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పటంపై వ్యంగ్యాస్త్రాలు సందించారు ఠాక్రే. అయితే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పవార్‌ సాహెబ్‌ మరో తప్పుచేశారని తాను అనబోనంటూ పరోక్షంగా మోదీపై వ్యంగ్య బాణాలు విసిరారు.

సుగర్​ ఇన్​స్టిట్యూట్​ వార్షిక సమావేశానికి సంస్థ ఛైర్మన్​, నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఇదీ చూడండి:'పౌర' నిరసనలపై యూపీ డీజీపీకి ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు

Last Updated : Dec 26, 2019, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details