సహకార బ్యాంక్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కార్యాలయానికి వెళ్తానన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటనతో నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. శాంతి భద్రతల దృష్ట్యా ఈ రోజు తాను ఈడీ కార్యాలయానికి వెళ్లడం లేదని ప్రకటించారు పవార్.
శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఈడీ కార్యాలయానికి వెళ్లొద్దని ముంబయి నగర కమిషనర్ సంజయ్ బార్వే.. పవార్ నివాసానికి వెళ్లి అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించారు ఎన్సీపీ అధినేత.
"ప్రస్తుతానికి ఈడీ కార్యాలయానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నాను. అవసరమైనప్పుడు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజ్యాంగ సంస్థలను అడ్డుపెట్టుకుని కొందరు భయపెట్టాలని చూస్తున్నారు. కానీ వారు విజయవంతం కాలేరు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. సహకార బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేదు. "
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత.
ఈడీ కేసు నమోదు చేయటంపై తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు పవార్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఇతర సీనియర్ నాయకులు, శివసేనా తనకు బాసటగా నిలిచినట్లు చెప్పారు.
ఇదీ కేసు...