తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన ఒడిశా సీఎం

ఒడిశాలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్​ పట్నాయక్​​. ఇప్పటికే జరిగిన మూడు దశల ఎన్నికల్లోనే తమకు కావాల్సిన స్థానాలు వచ్చేశాయని ధీమా వ్యక్తం చేశారు. తన ప్రమాణస్వీకారానికి రావాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఒడిశాలో నాలుగోదశ పోలింగ్​ ఈ నెల 29న జరగనుంది.

మాట్లాడుతున్న నవీన్​ పట్నాయక్​

By

Published : Apr 25, 2019, 5:06 AM IST

Updated : Apr 25, 2019, 8:28 AM IST

ఒడిశాలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్​ అధినేత నవీన్​ పట్నాయక్​. ఒడిశాలోని బాలాసోర్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో తమ పార్టీ గెలవడం తథ్యమని, తన ప్రమాణస్వీకారానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.

ఒడిశాలో అసెంబ్లీ, లోక్​సభ స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్​ జరగనుంది. ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. నాలుగో దశ పోలింగ్​ ఈ నెల 29న జరుగుతుంది. మే 23న ఫలితాలు వెలువడతాయి.

ఇప్పటికే గెలిచేశాం

మూడు దశల పోలింగ్​లో తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఓట్లు, స్థానాలు సాధించామని విశ్వాసం వ్యక్తం చేశారు సీఎం నవీన్​ పట్నాయక్​.

" బీజేడీ అధికారంలో నుంచి దిగిపోయాక రాష్ట్రంలోకి వస్తానని ప్రధాని మోదీ మంగళవారం అన్నారు. కానీ మూడు దశల పోలింగ్​ తర్వాతే బీజేడీ విజయాన్ని ఖాయం చేసుకుంది. నేను ప్రధానిని సవినయంగా బీజేడీ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానిస్తున్నా" -- నవీన్​ పట్నాయక్​, ఒడిశా సీఎం, బీజేడీ అధినేత

కష్టాల్లో ఉన్నప్పుడు రాలేదు

భాజపాపై విమర్శల దాడి చేశారు నవీన్​ పట్నాయక్​. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు మోదీ ఇక్కడికి రాలేదని ఆరోపించారు.

"తుపానులు, వరదలు, కరువుల బారీన పడిఒడిశా కష్టాల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి రాలేదు. అప్పుడు ఆయనకు సమయం లేదు. ఎన్నికలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి చాలాసార్లు వస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు"

-- నవీన్​ పట్నాయక్​, ఒడిశా సీఎం, బీజేడీ అధినేత

Last Updated : Apr 25, 2019, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details