తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇదే 'నవీన' ప్రస్థానం.. 2 దశాబ్దాలుగా ఆయనే సీఎం - జాతీయం వార్తలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నో సాధించామని, రాష్ట్ర ప్రజలు మరింత అభివృద్ధి చెందాలంటే ఇంకా దూరం ప్రయాణించాలని పేర్కొన్నారు.

Patnaik completes 20 years as CM, says still a long way to go to empower people
ఇదే 'నవీన' ప్రస్థానం.. 2 దశాబ్దాలుగా ఆయనే సీఎం

By

Published : Mar 6, 2020, 6:00 AM IST

ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా బీజేడీ అధ్యక్షుడు నవీన్​ పట్నాయక్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

పట్నాయక్​ ఒడిశా సీఎంగా 2000, మార్చి 5న ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్ల ఈ ప్రజానాయకుడు గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. వరుసగా ఐదోసారి అధికారాన్ని చేపట్టారు.

"20 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవ చేసేందుకు అవకాశాన్నిచ్చినందుకు ఒడిశా ప్రజలకు కృతజ్ఞతలు. ఇప్పటివరకు ఎన్నో సాధించాం. అయితే రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజలను శక్తిమంతం చేయాలంటే మరింత దూరం ప్రయాణించాల్సి ఉంది."

- నవీన్ పట్నాయక్​, ఒడిశా ముఖ్యమంత్రి

1999లో వచ్చిన తుపాను కారణంగా సుమారు 10 వేల మంది చనిపోయారని, అలాంటి ఘటన నుంచి రాష్ట్రం కోలుకోవడానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని పట్నాయక్​ గుర్తుచేశారు.

గతేడాది వణికించిన ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు ప్రధాని మోదీ, ఐరాస, ఇతర అంతర్జాతీయ సంస్థలు పట్నాయక్​ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

గడిచిన 20 ఏళ్లలో తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకొందని ఇటీవల అసెంబ్లీలో తెలిపారు పట్నాయక్​. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఏకైక రాష్ట్రం ఒడిశా అని ఉద్ఘాటించారు. దశాబ్దకాలంలో 8 మిలియన్లకు పైగా ప్రజల జీవితాల్లో పేదరికాన్ని నిర్మూలించినట్లు పేర్కొన్నారు.

రాజకీయ ప్రస్థానం సాగిందిలా..

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్​ ముగ్గురు పిల్లల్లో చిన్నవారు నవీన్​ పట్నాయక్​. 1997లో బిజూ పట్నాయక్​ మరణించిన అనంతరం.. పార్టీ పగ్గాలను చేపట్టారు నవీన్​. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా సీఎం బాధ్యతలు చేప్టటిన పట్నాయక్​.. రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఓటమి చవిచూడలేదు.

*1997 నుంచి ఇప్పటివరకు వరుసగా 8 సార్లు బీజేడీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

*2000 నుంచి ఇప్పటి వరకు పలు ఆరోపణలపై నలుగురు మంత్రులను తన మంత్రిమండలి నుంచి తొలగించారు.

*2014లో దేశమంతటా మోదీ హవా నడుస్తున్నా.. ఒడిశాలోని 21 లోక్​సభ స్థానాల్లో 20 సీట్లను బీజేడీ సొంతం చేసుకొంది. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. 2019 లోనూ అదే జోరును కనబరిచి మళ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకొంది బీజేడి.

ABOUT THE AUTHOR

...view details