తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమానుషం: విరిగిన కాళ్లను తలగడలా వాడిన వైద్యులు - train accident

హరియాణా ఫరీదాబాద్​లో ఘోరం జరిగింది. రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన వ్యక్తి పట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. విరిగిన కాళ్లను రోగికి తలగడలా పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

అమానుషం

By

Published : Aug 24, 2019, 5:06 PM IST

Updated : Sep 28, 2019, 3:15 AM IST

విరిగిన కాళ్లను తలగడలా వాడిన వైద్యులు

హరియాణా ఫరీదాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగి​ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. విరిగిన కాళ్లనే తలగడగా పెట్టారు. సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రదీప్​ ఫరీదాబాద్​లోని ఓ ప్రైవేట్​ సంస్థలో పనిచేస్తున్నారు. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లే దారిలో రైలు మార్గం ఉంది. పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న రైలు ప్రదీప్​ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రదీప్​ రెండు కాళ్లు కోల్పోయారు. చికిత్స నిమిత్తం ఫరీదాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు.. ప్రదీప్​ తల కింద విరిగిన కాళ్లను పెట్టి అమానుషంగా ప్రవర్తించారు. ఆ సమయంలో చిత్రీకరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఆసుపత్రిలో పూర్తిస్థాయి సౌకర్యాలు ఉన్నా.. ఈ విధంగా చేయటం వైద్యుల నిర్లక్ష్యమేనని స్థానికులు మండిపడుతున్నారు.

ఇదీ చూడండి: నిగంబోధ్​ ఘాట్​లో అరుణ్​ జైట్లీ అంత్యక్రియలు

Last Updated : Sep 28, 2019, 3:15 AM IST

ABOUT THE AUTHOR

...view details