తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​లో అగ్నిప్రమాదం... అందరూ సురక్షితం - వైద్యసేవల పునరుద్ధరణ

దిల్లీ ఎయిమ్స్​లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రోగులకు వైద్యసేవలు పునరుద్ధరించారు. షార్ట్​సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

దిల్లీ ఎయిమ్స్​లో అగ్నిప్రమాదం... అందరూ సురక్షితం

By

Published : Aug 18, 2019, 6:26 AM IST

Updated : Sep 27, 2019, 8:48 AM IST

దిల్లీ ఎయిమ్స్​లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అత్యవసర విభాగంలోని రోగులకు ప్రస్తుతం వైద్యసేవలు పునరుద్ధరించారు.

దిల్లీ ఎయిమ్స్​ టీచింగ్ బ్లాక్​లోని మైక్రోబయాలజీ డిపార్టుమెంట్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వైరాలజీ విభాగం పూర్తిగా దగ్ధమైంది. దట్టమైన పొగలు వ్యాపించడం వల్ల ఏబీ-1 వార్డులోని రోగులను ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది 2 గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు.
షార్ట్​సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: 'భారత్​ ​- భూటాన్​ ఆదర్శప్రాయమైన భాగస్వామ్యం '

Last Updated : Sep 27, 2019, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details