తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరసనలవైపు ప్రజలను ఆ పార్టీలే ప్రేరేపిస్తున్నాయి: మోదీ

parliament, budget
పార్లమెంటు

By

Published : Feb 6, 2020, 12:48 PM IST

Updated : Feb 29, 2020, 9:40 AM IST

15:00 February 06

ఆ రోజే కశ్మీర్​ ఉనికి కోల్పోయింది: మోదీ

అధికరణ 370 రద్దును ఉద్దేశించి జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్​ అబ్దుల్లాలను విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. ఉగ్రవాద చర్యలు, కశ్మీరీ పండితుల బహిష్కరణతో 1990 జనవరి 19న కశ్మీర్​ ఉనికి కోల్పోయిందన్నారు. ఆ రోజును చీకటి రాత్రిగా అభివర్ణించారు.

14:52 February 06

నిరసనలను ఆ రెండు పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి: మోదీ

పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలకు సంబంధించి కాంగ్రెస్, వామపక్షాలను నిందించారు ప్రధాని మోదీ. నిరసన చేపట్టేలా ఈ రెండు పార్టీలు ప్రజలను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు.

14:01 February 06

రాహుల్​ను విమర్శించిన మోదీ

ట్యూబ్​లైట్లకు అర్థం కాదు: ప్రధాని

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. ఆరు నెలల్లో కర్రతో మోదీని దండిస్తానని చేసిన వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారు.

"నిన్న ఓ కాంగ్రెస్​ నేత నన్ను విమర్శించారు. ఆరు నెలల్లో నా వీపుపై కర్రతో కొడతానని అన్నారు. ఇది కొద్దిగా కష్టమైన పని కావటం వల్ల ఆరునెలల సమయం సరిపోతుంది. ఈ సమయంలో నేను సూర్యనమస్కారాల సంఖ్య పెంచి.. నా వీపును దృఢంగా చేసుకుంటా. ఎలాగంటే ఎన్ని దెబ్బలు కొట్టినా ఏమీ కాకుండా చూస్తా."

- ప్రధాని నరేంద్రమోదీ

ప్రసంగం మధ్యలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా మరోసారి విమర్శించారు మోదీ.

"నేను 30-40 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను. కానీ వాళ్లకు అర్థం కావటానికి ఇంత సమయం పట్టింది. ఇలాంటి ట్యూబ్​లైట్లకు ఇలాగే జరుగుతుంది."

-ప్రధాని నరేంద్రమోదీ

13:46 February 06

రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ విస్మరించింది: ప్రధాని

  • కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అనేకసార్లు పనిచేసింది
  • అత్యయిక పరిస్థితిని విధించారు, రాజ్యాంగానికి అనేకసార్లు సవరణలు చేశారు
  • పలుమార్లు 356 అధికరణను ప్రయోగించారు

13:35 February 06

ప్రధాని నరేంద్రమోదీ

మీలా మేము ఉండుంటే.. ఏదీ జరిగేది కాదు: మోదీ

విపక్ష కాంగ్రెస్సే లక్ష్యంగా ప్రధాని మోదీ మరోమారు విమర్శనాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్​ అనుసరించిన ఆలోచనలు, పద్ధతులను భాజపా కూడా పాటించి ఉంటే.. దేశంలో ఏళ్లుగా ఉన్న సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం దొరికేది కాదని పేర్కొన్నారు.

"మీరు అనుసరించిన పద్ధతులను మేమూ అనుసరించి ఉంటే, మీరు నడిచిన మార్గంలోనే మేమూ నడిచి ఉంటే.. 70ఏళ్ల తర్వాత కూడా ఆర్టికల్​ 370 రద్దు జరిగి ఉండేది కాదు. మీ ఆలోచనా విధానాలతోనే మేమూ ముందుకు వెళ్లుంటే.. 'ముమ్మారు తలాక్​' కత్తి నుంచి ముస్లిం మహిళలకు ఉపశమనం లభించేది కాదు. మీరు నడిచిన మార్గంలోనే మేమూ నడిచి ఉంటే... అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష పడేలా చట్టం వచ్చేది కాదు. మీ ఆలోచనలతోనే నడిచి ఉంటే.. రామ​ జన్మభూమి ఇప్పటికీ వివాదాల్లోనే ఉండేది. మీలాగే మేమూ ఆలోచించి ఉంటే.. కర్తార్​పుర్​ నడవా వచ్చేదే కాదు. మీరు ఎంచుకున్న పద్ధతులనే మేమూ అనుసరించి ఉంటే భారత్​-బంగ్లాదేశ్​ మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం దక్కేది కాదు."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

13:29 February 06

ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేశాం: ప్రధాని

  • 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది
  • మేము అధికారం చేపట్టిన ఐదేళ్లలో అనేక కీలక సమస్యలకు పరిష్కారం చూపాం
  • పెట్టుబడిదారులకు భరోసా కల్పించాం
  • ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అనేక చర్యలు చేపట్టాం
  • సాధ్యమైనన్ని ఉద్యోగాల సృష్టి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించ
  • ముద్రా రుణాల ద్వారా స్వయం ఉపాధి కల్పించాం
  • రైతుల నుంచి ఎంతో నేర్చుకున్నా
  • విమర్శలను మా ప్రభుత్వం స్వీకరిస్తోంది
  • స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాం
  • ముద్రా లబ్ధిదారుల్లో మహిళలకు పెద్దపీటం వేశాం
  • కార్మికుల శ్రేయస్సు కోసం సంస్కరణలు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం
  • సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం
     

13:24 February 06

గాంధీ స్ఫూర్తితో పనిచేస్తున్నాం: ప్రధాని

  • ప్రతిపక్షం గాంధీ అమర్‌రహే అనే నినాదాలు చేస్తోంది
  • మహాత్మాగాంధీ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది

13:20 February 06

రైతులు సంక్షేమం రాజకీయ ప్రయోజనం కాదు: ప్రధాని

  • రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని రాష్ట్రాలు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయట్లేదు
  • రైతుల సంక్షేమ విషయంలో రాజకీయ ప్రయోజనాలు చూడొద్దని విజ్ఞప్తి
  • రైతుల అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలి
  • మా పాలనలో వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచాం
  • పీఎం కిసాన్ సమ్మాన్ యోజన రైతుల జీవితాలను మార్చేసింది

13:09 February 06

అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశాం: ప్రధాని

  • అందరికీ విద్యుత్, రైలు, విమాన, చరవాణి సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం
  • ఈశాన్య భారత్‌ను దిల్లీకి దగ్గర చేశాం
  • ఈశాన్యంలో కొత్త అధ్యాయం లిఖించాం
  • ఈశాన్యంలో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కారం చూపాం
  • ఏడు దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు
  • వ్యవసాయం, రైతు సంక్షేమంపై స్పష్టమైన ఆలోచనను రాష్ట్రపతి ఆవిష్కరించారు
  • దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌పీ సమస్యను పరిష్కరించాం
  • పంట బీమా, నీటిపారుదల అంశాలకు కూడా పరిష్కారం చూపాం

13:01 February 06

సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనే సత్తా మాలో ఉంది: ప్రధాని

  • ప్రభుత్వాన్ని మార్చడం కోసం కాదు.. ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాన్ని మార్చేందుకు మమ్మల్ని ఎన్నుకున్నారు.
  • స్వతంత్ర భారతంలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నింటినో పరిష్కరించాం.
  • ప్రపంచం భారత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
  • సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మరింతకాలం వేచిచూసే పరిస్థితి లేదు.
  • పాలనలో పారదర్శకత, వేగాన్ని తీసుకొచ్చాం.
  • 37 కోట్ల  మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చాం.
  • 11 కోట్ల మందికి వారి గృహాల్లో మరుగుదొడ్ల వసతి కల్పించాం.
  • 13 కోట్ల మందికి వంటగ్యాస్ సౌకర్యం కల్పించాం.
  • 2 కోట్ల మందికి సొంత గృహాలు నిర్మించి ఇచ్చాం.
  • గత ఐదేళ్ల పాలన చూసే ప్రజలు మళ్లీ మాకు అధికారం అప్పగించారు.

12:51 February 06

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని సమాధానం

  • రాష్ట్రపతి ప్రసంగం నవీన భారత నిర్మాణాన్ని ఆవిష్కరించింది: ప్రధాని
  • భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రోడ్‌మ్యాప్‌ అందిస్తోంది: ప్రధాని
  • గత ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే చారిత్రక మార్పులు చేసేవాళ్లం కాదు: ప్రధాని
  • ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కలిగేది కాదు: ప్రధాని
  • రామజన్మభూమి సమస్య పరిష్కారమయ్యేది కాదు: ప్రధాని
  • కర్తాపూర్ సాహెబ్ కారిడార్ వాస్తవ రూపంలోకి వచ్చేది కాదు: ప్రధాని
  • మేము అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం: ప్రధాని

10:20 February 06

లోక్​సభలో ప్రధాని ప్రసంగం

లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్రమోదీ సమాధానమిస్తున్నారు. 

రాష్ట్రపతి ప్రసంగం నవీన భారత నిర్మాణాన్ని ఆవిష్కరించిందన్నారు ప్రధాని

Last Updated : Feb 29, 2020, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details