తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2019, 5:11 PM IST

ETV Bharat / bharat

పోంజి స్కీములకు కళ్లెం... బిల్లుకు పార్లమెంటు ఆమోదం

అక్రమ డిపాజిట్ల పథకం నిషేధం బిల్లుకు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పోంజి స్కీంల నుంచి చిన్న, మధ్య తరగతి పెట్టుబడిదారులకు రక్షణ కల్పించే ఈ బిల్లుకు ఇప్పటికే లోక్​సభ ఆమోదం తెలుపగా నేడు రాజ్యసభలో నెగ్గింది.

పార్లమెంటు

పోంజీ స్కీంల నుంచి చిన్న మధ్య తరగతి పెట్టుబడిదారులకు రక్షణ కల్పించే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అక్రమ డిపాజిట్ల పథకం నిషేధం బిల్లు-2019ని ఆర్థిక మంత్రి రాజ్యసభలో ప్రవేశపెట్టగా స్వల్ప చర్చల అనంతరం మూజువాణి ఓటుతో నెగ్గింది.

ఓటింగ్​కు ముందు జరిగిన చర్చలో భాగంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ సింగ్​ ఠాకూర్​ బిల్లుపై మాట్లాడారు.

అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి

"ఫైనాన్స్​ స్టాండింగ్​ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. దేశంలోని చిన్న, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లు ఇది. పోంజి స్కీముల్లో పేదలు డబ్బులు పోగొట్టుకునేందుకు అవకాశం లేకుండా రూపొందించిన ఈ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. పేదల సంక్షేమం కోసం ఈ బిల్లును మీరూ ఆశీర్వదించండి. అక్రమార్కులను శిక్షించేందుకు ఈ బిల్లుకు ఓటెయ్యండి."

-అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి

ఈ చట్టం అమల్లోకి వస్తే డిపాజిట్​ పథకాల్లో అక్రమాలకు పాల్పడే వారికి జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అనుమతి లేని సంస్థలపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది.

లోక్​సభలో జులై 24న ఈ బిల్లుకు ఆమోదం లభించింది. నిజానికి ఈ బిల్లును ఫిబ్రవరిలోనే దిగువ సభ ఆమోదించింది. అయితే రాజ్యసభలో పాసయ్యేందుకు సభా సమయం సరిపోలేదు. బిల్లు చర్చకు వచ్చేలోపు రాజ్యసభ సెషన్​ వాయిదా పడింది.

ఇదీ చూడండి: ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన- అరెస్టు

ABOUT THE AUTHOR

...view details