రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మూడు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు పట్టు వీడలేదు. సాగు చట్టాలపై చర్చకు డిమాండ్ చేశాయి. దీంతో సభను బుధవారం ఉదయం 9 గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
పట్టువీడని విపక్షాలు- రాజ్యసభ రేపటికి వాయిదా - rajyasabha session news
12:33 February 02
11:33 February 02
రాజ్యసభ మూడో సారి వాయిదా పడింది. 11:30 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు సాగుచట్టాలపై చర్చ చేపట్టాలని ఆందోళన కొనసాగించారు. దీంతో 12:30 గంటలకు సభను మరోమారు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
10:35 February 02
10:30 గంటలకు తిరిగి ప్రారంభమైన రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. సాగు చట్టాలపై చర్చకు విపక్ష నాయకులు పట్టుబట్టడం వల్ల సభను మరోసారి ఉదయం 11:30గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
09:48 February 02
సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు సభలో గందరోగళం సృష్టించాయి. ఈ విషయంపై తొలుత లోక్సభలో చర్చించాలని, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించిన తర్వాత బుధవారం సాగు చట్టాలపై చర్చిద్దామని ఛైర్మన్ వెంకయ్య నాయుడు విపక్షాలకు సూచించారు. అయితే చర్చ ఇవాళే జరగాలని డిమాండ్ చేస్తూ విపక్ష నాయకులు సభనుంచి వాకౌట్ చేశారు. దీంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను 10:30గంటల వరకు వాయిదా వేశారు.
09:42 February 02
రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. సాగుచట్టాలపై చర్చకు డిమాండ్ చేయగా.. ఛైర్మన్ నిరాకరించడంతో నిరసనగా సభను వీడాయి.
09:27 February 02
పట్టువీడని విపక్షాలు- రాజ్యసభ రేపటికి వాయిదా
రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దుతుగా విపక్షలు సభలో నినాదాలు చేశాయి. రైతు సమస్యలపై చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. అయితే రైతు సమస్యలపై సభలో బుధవారం చర్చిద్దామని ఛైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు.