తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాన్​-ఆధార్ అనుసంధాన​ గడువు పొడిగింపు - latest national news

శాశ్వత ఖాతా సంఖ్య(పాన్​)ను ఆధార్​తో​ అనుసంధాన గడువును  వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.

pan-aadhar
పాన్​-ఆధార్​ గడువు పొడగింపు

By

Published : Dec 30, 2019, 11:03 PM IST

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) కార్డుతో ఆధార్‌ అనుసంధానంగడువు రేపటితో ముగుస్తుండగా... తాజాగా మరోసారి పొడిగించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). వచ్చే ఏడాది(2020)మార్చి 31వరకు సమయమిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

"ఆదాయ పన్ను చట్టం సెక్షన్​ 139ఏఏ కింద సబ్​ సెక్షన్​ 2 ప్రకారం పాన్​ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానించాల్సిన ఆధార్​ గడువు తేది 2019 డిసెంబర్​ 31వ నుంచి 2020 మార్చ్​ 31వరకు పొడిగిస్తున్నాం."

-సీబీడీటీట్వీట్​ .

ఈ అనుసంధాన ప్రక్రియ గడువు సమయాన్ని పొడిగించడం ఇది ఎనిమిదో సారి. రిటర్నులు దాఖలు చేసే వారికి ఆధార్​ అనుసంధానంతప్పనిసరి చేయాలనిగతేడాది ఏప్రిల్​లో సుప్రీం ఆదేశించింది.

ఇదీ చూడండి : 'పౌర' సెగతో భారతీయ రైల్వేకు రూ.80కోట్లు నష్టం

ABOUT THE AUTHOR

...view details