తెలంగాణ

telangana

By

Published : Aug 20, 2019, 7:02 AM IST

Updated : Sep 27, 2019, 2:53 PM IST

ETV Bharat / bharat

భారత్​లో పెళ్లి చేసుకున్న పాకిస్థానీ జంట!

మరో రెండు జంటలు పాకిస్థాన్​ నుంచి భారత్​కు వచ్చి పెళ్లి చేసుకున్నాయి. ఎలాగోలా సరిహద్దు దాటి వచ్చిన వీరు ఇకపై భారత్​లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

భారత్​లో పెళ్లి చేసుకున్న పాకిస్థానీ జంట!

భారత్​లో పెళ్లి చేసుకున్న పాకిస్థానీ జంట!

రెండు పాకిస్థానీ జంటలు గుజరాత్​లో ఒక్కటయ్యాయి. రాజ్​కోట్​ మహేశ్వరీ సమాజ్​లో వారి వివాహం జరిగింది.

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత, భారత్​ పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఓ పాకిస్థానీ హిందూ జంట భారత్​కు వచ్చి శనివారం పెళ్లి చేసుకుంది. మహేశ్వరీ కులానికి చెందిన వీరు పాక్​ కరాచీ వాసులు. వారి వివాహానికి అక్కడ అనుమతి లేనందున సరిహద్దులు దాటి వివాహ వేడుకను జరిపించుకున్నారు.

"మహేశ్వరీ సమాజంలో 90కు పైగా పాకిస్థానీ హిందూ జంటలకు పెళ్లి జరిపించాం. వారిని భారత్​లో స్థిరపడేందుకు సహకరించాం. శనివారం పెళ్లి చేసుకున్నవారు కూడా ఇక్కడ ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. గతేడాది మేము 15 మందికి పెళ్లి జరిపించాం. మా కులస్థులు చాలా మంది పాక్​లో ఇబ్బందులకు గురవుతున్నారు. వారి ప్రాణాలకు భద్రత లేదు. ఇక వారి వివాహాలకు అస్సలు ప్రాధాన్యం ఉండదు. కానీ మేమిక్కడ వారి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాం."

-మహేశ్వరీ యువజన సంఘం అధ్యక్షుడు, భావేశ్​ మహేశ్వరీ

దాదాపు 3000 మహేశ్వరీ కుటుంబాలు కరాచీలో జీవిస్తున్నాయి. వారిలో చాలామంది లాంగ్​టైం వీసాను పొంది దానినే పొడగిస్తూ ఇక్కడే ఉండిపోతున్నారు.

ఇదీ చూండండి:ఎరక్కపోయి నదిలో ఇరుక్కున్న బావ బామ్మర్ది!

Last Updated : Sep 27, 2019, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details