తెలంగాణ

telangana

By

Published : Feb 29, 2020, 5:36 AM IST

Updated : Mar 2, 2020, 10:25 PM IST

ETV Bharat / bharat

'దుశ్చర్యలకు పాల్పడాలంటే పాక్​ 100 సార్లు ఆలోచించాలి'

సరిహద్దు వెంబడి దాడులు చేయాలంటే పాకిస్థాన్ ఒకటికి​ 100 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలని హెచ్చరించారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. మెరుపుదాడులు, బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా భారత్​ సత్తా ఏమిటో దాయాది దేశానికి తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు.

Pak will think 100 times before any misadventure against India: Rajnath
'దుశ్చర్యలకు పాల్పడాలంటే పాక్​ 100 సార్లు ఆలోచించాలి'

ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్​కు సర్జికల్​ స్ట్రైక్స్​​, బాలాకోట్​ వైమానిక దాడుల ద్వారా భారత్​ గట్టి సమాధానం ఇచ్చిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఉద్ఘాటించారు. సరిహద్దు వెంబడి ఉగ్రచర్యలకు పాల్పడే ముందు దాయాది దేశం ఒకటికి 100 సార్లు ఆలోచించాలని హెచ్చరించారు.

పుల్వామా దాడులకు ప్రతిస్పందనగా.. సరిహద్దు వెంబడి శత్రుదేశంపై వైమానిక దాడులు జరిపేందుకు బలవంతంగా తమ సిద్ధాంతాలనుమార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

మున్ముందు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడాలని చూసినా తమ ప్రభుత్వం దీటైన సమాధానం చెబుతుందని పేర్కొన్నారు రాజ్​నాథ్​. పుల్వామా దాడి అనంతర పరిణామాలతో.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్​కు ఉందని నిరూపితమైనట్లు స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధానికి భారత్​ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

పుల్వామా ఘటనపై ఆగ్రహంతో...

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్ చేసిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించారు. ఈ దాడికి ఆగ్రహించిన భారత్​.. పాకిస్థాన్​లోని బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై​ వైమానిక దాడులు చేసి దీటైన సమాధానం ఇచ్చింది​.

ఉరీ సెక్టార్​లో దాడి అనంతరం.. 2016లో సెప్టెంబర్​ 29న పాక్​ సైనిక శిబిరాలపై తొలిసారి సర్జికల్​ స్ట్రైక్స్(మెరుపు దాడులు) చేసింది భారత సైన్యం.

ఇదీ చూడండి:ఆసక్తికర సన్నివేశం: అమిత్​షాతో దీదీ విందు

Last Updated : Mar 2, 2020, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details