తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సంఝౌతా' పేలుడు కేసు తీర్పుపై పాక్​ అభ్యంతరం

పాకిస్థాన్​ భారత న్యాయవ్యవస్థపై విమర్శలు గుప్పించింది. సంఝౌతా ఎక్స్​ప్రెస్​ పేలుడు కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై భారత హైకమిషనర్​ని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది.

'సంఝౌతా' తీర్పులో భారత న్యాయవ్యవస్థపై పాక్​​ అభ్యంతరం

By

Published : Mar 21, 2019, 6:33 AM IST

Updated : Mar 21, 2019, 6:52 AM IST

'సంఝౌతా' తీర్పులో భారత న్యాయవ్యవస్థపై పాక్​​ అభ్యంతరం

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ పేలుడు కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై పాకిస్థాన్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత న్యాయవ్యవస్థపై విమర్శలు గుప్పించింది. భారత్ హైకమిషనర్​ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ పేలుడు కేసులో పంచకులలోని ప్రత్యేక ఎన్​ఐఏ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్వామి అసిమానంద సహా నలుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది. ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి జగ్దీప్​ సింగ్​, పాకిస్థాన్​ మహిళ దాఖలు చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. ఆమె అభ్యర్థన ఏ యోగ్యత లేనిదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ తీర్పుపై మండిపడిన పాకిస్థాన్​ విదేశాంగ కార్యదర్శి, భారత హైకమిషనర్​ అజయ్ బిసారియాను పిలిపించి తమ నిరసన తెలిపారు.

ఇదీ జరిగింది...

2007 ఫిబ్రవరి 18న హరియాణా పానిపట్​ సమీపంలో పాకిస్థాన్​ వెళ్తున్న సంఝౌతా ఎక్స్​ప్రెస్​లో​ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పాక్​కు చెందినవారే. ఈ కేసుకు సంబంధించి ఎన్​ఐఏ 8 మందిని నిందితులుగా గుర్తించి ఎఫ్​ఐఆర్​ నమోదుచేసింది. అయితే న్యాయస్థానం ముందు మాత్రం నలుగురినే ప్రవేశపెట్టింది. వీరిలో స్వామి అసిమానందతోపాటు లోకేశ్​ శర్మ, కమల్​ చౌహాన్​, రాజేందర్​ చౌదరి ఉన్నారు. వీరందరినీ న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది.

Last Updated : Mar 21, 2019, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details