తెలంగాణ

telangana

ETV Bharat / bharat

100 మంది జాలర్లను విడుదల చేసిన పాక్ - fishermen

బందీలుగా ఉన్న 100మంది భారత జాలర్లను విడుదల చేసింది పాకిస్థాన్. తమ ప్రాదేశిక జలాల్లోకి చొచ్చుకొచ్చారన్న కారణంతో వివిధ సమయాల్లో 360 మందిని బంధిచింది పాక్​. దశల వారిగా వారిని విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించింది.

100 మంది జాలర్లను విడుదల చేసిన పాక్

By

Published : Apr 15, 2019, 12:25 AM IST

100 మంది జాలర్లను విడిచిపెట్టిన పాక్

పుల్వామా దాడి అనంతరం భారత్​తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్​ దిద్దుబాటు చర్యలను కొనసాగిస్తోంది. బందీలుగా ఉన్న 100మంది భారత జాలర్లను శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటికే ఈ నెల 7న 100 మంది జాలర్లను భారత్​కు పంపింది. వీరు ఇప్పటివరకు కరాచీలోని మాలీర్ జైల్​లో ఉన్నారు. లాహోర్​కు తీసుకువచ్చి అక్కడి నుంచి అటారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్​కు అప్పగించింది.

ఈ నెల 7వరకు పాక్ చెరలో 360 మంది భారత జాలర్లు ఉండగా 200 మందిని విడుదల చేసింది. ఈ నెల 22న మరో 100 మందిని స్వదేశానికి పంపిస్తామని ప్రకటించింది పాక్. ఈ నెల 29న 55 మంది జాలర్లు, ఐదుగురు బందీలను వెనక్కి పంపించడం ద్వారా ఈ ప్రక్రియ ముగియనుంది.

తాము ఏ ప్రాదేశిక జలాల్లో పయనిస్తామో తెలిపే సాంకేతికత లేని నాటు పడవల కారణంగా ఇరు దేశాల జాలర్లు బంధీలుగా మారుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇరు వైపులా జాలర్ల అప్పగింతకు నెలల సమయం పడుతోంది. కొన్ని సార్లు సంవత్సరాల కాలం పడుతోంది.

ABOUT THE AUTHOR

...view details