తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"చెప్పేది ఒకటి..చేసేది మరొకటి" - జైష్

ఉగ్రవాదుల స్వర్గధామమన్న పేరును సార్థకం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది పాక్. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్లు ఉగ్రసంస్థలకు కొమ్ము కాస్తోంది. అంతర్జాతీయ ఒత్తిళ్లతో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ప్రకటించిన పాక్ వారికి కల్పిస్తోన్న భద్రతను చూస్తే కళ్లు తిరగక మానవు. జైషే మహ్మద్​ వ్యవస్థాపకుడు మసూద్ అజార్​కు రాజకీయ నేతలకన్నా పకడ్బందీ భద్రతను కల్పిస్తోంది.

ఇమ్రాన్​ఖాన్​

By

Published : Mar 9, 2019, 1:17 PM IST

పాక్​ వక్రబుద్ది

ఉగ్రవాదాన్ని అణచివేయాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించినా పాక్ తన వక్రబుద్ధి మరోసారి బయటపెట్టుకుంది. జైషే మహమ్మద్ కార్యాలయానికి ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ నివాసానికి పాక్ పోలీసులతో పటిష్ట భద్రతను కల్పిస్తోంది. ఉగ్రవాదం అణచివేతపై భారత్​ తెస్తున్న ఒత్తిళ్లను ఖాతారు చేయకపోవడాన్ని గమనిస్తే ఉగ్రవాదులే పాక్​ను నియంత్రిస్తున్నారా అన్న అనుమానాలకు తావిస్తోంది.

పుల్వామాతో పాటు భారత్​లో ఎన్నో దాడులకు కారణమైన జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఇదే. దక్షిణ పాకిస్థాన్​లోని బహవల్​పూర్​లో ఉన్న ఈ భవనాన్ని అధునాతన తుపాకులతో పోలీసులు నిత్యం పహారా కాస్తుంటారు. మతం పేరుతో సమావేశాలను నిర్వహించి స్థానికులను తమవైపుకు తిప్పుకుంటోంది ఈ ఉగ్రసంస్థ. అందుకే జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ కాదని కేవలం మతాన్ని వ్యాప్తి చేయడం కోసం కృషి చేసే సంస్థ మాత్రమేనని అంటున్నారు అక్కడి ప్రజానీకం.

జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ కాదు. వారి లక్ష్యం ఇస్లాంను వ్యాపింపజేయడమే. మసూద్ అజార్ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. మేం తప్పు చేస్తే అల్లా క్షమించడు. అందుకే మసూద్ తప్పు చేయడు. ఆయన ఉగ్రవాది అన్న ఆరోపణలు అవాస్తవం-తాహిర్ జియా, బహవల్ పూర్ నివాసి

భారత్​పై విద్వేషాన్ని వెదజల్లే జైషే చీఫ్ మసూద్ అజార్ నివాసం ఇది. అజార్ ఇంటి ముందు చెక్​పోస్ట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చెక్​పోస్ట్​ దాటి ముందుకెళితే రెండో వలయంలో అధునాతన ఆయుధాలతో పోలీసులు, వారికి తోడుగా స్థానికులు పహారా కాస్తుంటారు. అజార్​ను కలిసేందుకు వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతిస్తారు.

చాలా ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని వాగ్దానం చేశాయి. కానీ వాటిని ఎప్పుడూ అమలు చేయలేదు. ఉగ్రసంస్థలపై నిర్లక్ష్యమే పాక్ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారింది. పాక్​ భూభాగం నుంచి సరిహద్దు అవతల(భారత్​పై ) ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడులకు దిగే అవకాశం ఉంది.- జాహీద్ హుస్సేన్, రాజకీయ విశ్లేషకుడు

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ చేసిన వైమానిక దాడిలో చెట్లు కూలడం తప్ప ఎలాంటి నష్టం జరగలేదంటోంది పాక్. వైమానిక దాడి జరిగిన ప్రదేశమంటూ అంతర్జాతీయ మీడియాకు ఓ స్థలాన్ని చూపింది. భారత్​ దాడిలో కూలిన చెట్లు ఇవేనంటూ స్పష్టం చేస్తోంది. భారత్​, పాక్ వాదనలు విరుద్ధంగా ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు చల్లారకపోతే యుద్ధానికి దారితీసే అవకాశం ఉందంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

భారత్​, పాక్ ఉద్రిక్తతల్ని కొనసాగించకూడదు. ఈ వివాదం చల్లారకపోతే యుద్ధానికి దారి తీస్తుంది. ఇరు దేశాలు పోటాపోటీగా తలపడితే అణు యుద్ధానికి దారి తీయవచ్చు.-తలాక్ మసూద్, రక్షణ రంగ నిపుణుడు

భారత్​లో ఎన్నో విధ్వంసాలకు పాల్పడిన 'జమాత్ ఉద్​ దవా' ప్రధాన కార్యాలయం ఇదే. 2008లో జరిగిన ముంబై దాడుల్లో 'లష్కరే తోయిబా'కు సహకరించిందని జమాత్​పై భారత్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఉగ్రసంస్థ కార్యాలయం ముందూ కట్టుదిట్టమైన భద్రతే కన్పిస్తుంది.

ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామన్న పాక్ ప్రకటనలు అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిళ్లను తట్టుకునేందుకేనని ఈ దృశ్యాల్ని చూస్తే స్పష్టమౌతోంది. కంచే చేను మేసింది అన్న చందంగా ఉగ్రసంస్థల్ని ప్రోత్సహిస్తున్న పాక్ తీరు వల్ల ఆ దేశ పుట్టి మునగటం ఖాయమని తెలుస్తోంది.

ఇదీ చూడండి:పాక్​ దాడిని ముందుగా గుర్తించింది వారే...

ABOUT THE AUTHOR

...view details