తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్‌, బంగ్లా ముస్లింలను తరిమికొట్టాల్సిందే: శివసేన - Uddhav Thakre Comments on MNS

పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. భాజపాను విమర్శిస్తున్న శినసేన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్​లో అక్రమంగా ఉంటున్న పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ ముస్లిం ప్రజలను తరిమికొట్టాలని తమ అధికారిక పత్రికలో విమర్శించింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన​(ఎంఎన్​ఎస్​​)... తమ జెండా రంగు మార్చుకున్న నేపథ్యంలో ఎంఎన్​ఎస్​​పైనా విమర్శలు గుప్పించింది.

Pak, Bangla Muslims must be kicked out: Shiv Sena
పాక్‌, బంగ్లా ముస్లింలను తరిమికొట్టాల్సిందే: శివసేన

By

Published : Jan 25, 2020, 11:59 AM IST

Updated : Feb 18, 2020, 8:37 AM IST

పౌరసత్వ చట్ట సవరణపై గత కొంతకాలంగా భాజపాపై విమర్శల దాడికి దిగిన శివసేన తాజాగా... సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లింలను దేశం నుంచి తరిమికొట్టాల్సిందేనంటూ తమ అధికారిక పత్రిక సామ్నా కథనంలో పేర్కొంది. శివసేన మిత్రపక్షాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే సీఏఏలో లోపాలున్నాయంటూ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించింది.

ఎంఎన్​ఎస్​ పార్టే లక్ష్యంగా...

మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎస్‌)నూ విమర్శించింది శివసేన. ఇటీవల ఎంఎన్‌ఎస్ తమ జెండా రంగును పూర్తి కాషాయంలోకి మార్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘పాక్‌, బంగ్లా నుంచి వచ్చిన ముస్లింలను దేశం నుంచి తరిమికొట్టాల్సిందే. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే అలా చేయాలంటే మీ జెండా రంగును మార్చుకోవాల్సి ఉంటుందని ఎంఎన్‌ఎస్‌ను విమర్శించింది. శివసేన ఎప్పుడూ తమ జెండా రంగును మార్చుకోలేదు. హిందుత్వ సిద్ధాంతాల కోసం ఈ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంద’ని పేర్కొంది.

14ఏళ్ల క్రితం రాజ్‌ఠాక్రే మరాఠీ సిద్ధాంతాలతో ఎంఎన్​ఎస్​ పార్టీని స్థాపించారు. కానీ ఇప్పుడు హిందుత్వ సిద్ధాంతాల వైపు మారారు. కొన్ని వారాల క్రితమే రాజ్‌ఠాక్రే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు కేవలం ఓట్ల కోసం రంగులు మారుస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం భాజపా చేస్తున్న ప్రయత్నాలివి. సీఏఏ వల్ల కేవలం ముస్లింలే కాదు, హిందువులు కూడా ఇబ్బందులు పడే అవకాశముంది. ఈ చట్టంలో చాలా లోపాలున్నాయని శివసేన తమ కథనంలో చెప్పుకొచ్చింది.

ఇదీ చదవండి:'రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కొరవడింది'

Last Updated : Feb 18, 2020, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details