రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేబినేట్ కమిటి భేటీలో తీపి కబురు చెప్పింది. 2019-20 పంట కాలానికి అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరికి క్వింటాలు ధరలో 3.7 శాతంతో రూ.65 పెంచింది. ప్రస్తుతం వరి క్వింటాలుకు రూ.1750 నుంచి రూ.1815కు చేరుకుంది.
వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.65 పెంపు - CCEA
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఖరీఫ్ సీజన్‌కు వరి పంటకు కనీస మద్దతు ధర 3.7 శాతంతో రూ.65 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరి క్వింటాలుకు రూ.1750 నుంచి రూ.1815కు పెరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది.
వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.65 పెంపు
వివిధ పంటల కనీస మద్దతు ధర పెంపు ఈ విధంగా ఉంది...
పంట రకం | క్వింటాలకు పెంచిన ధర |
వరి | 65 |
జొన్నలు | 120 |
రాగులు | 253 |
కందులు | 215 |
పెసరపప్పు | 75 |
మినుములు | 100 |
వేరుశనగ | 200 |
సోయా | 311 |
సాధారణ రకం పత్తి | 105 |
పత్తి పొడువు పింజ | 100 |
ఇదీ చూడండి: రాహుల్ నిష్క్రమణ... కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు!