తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ పిట్ట కథ..!

భారత జలాంతర్గామి తమ ప్రాదేశిక జలాల్లో చొరబాటుకు యత్నించిందని పాక్ ఆరోపించింది. అయితే సమర్థంగా అడ్డుకున్నామని ప్రకటించింది.

పాక్​ పిట్ట కథ..!

By

Published : Mar 5, 2019, 5:31 PM IST

తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాలని యత్నించిన భారత జలాంతర్గామిని అడ్డుకున్నట్లు పాకిస్థాన్​ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. శాంతిని కోరుకుంటున్న దృష్ట్యా దాడి చేయలేదని పాక్​ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రాదేశిక జలాలను కాపాడుకోవటానికి తమ నావికా దళం సిద్ధంగా ఉందని పాక్​ ఉద్ఘాటించింది. 2016 నవంబర్‌ తర్వాత భారత నౌకాదళం ఇలా చేయటం ఇది రెండోసారని వివరించారు పాక్​ అధికారులు. ఇకనైనా భారత్​ శాంతిపథంలో పయనించాలన్నారు.

పుల్వామా దాడి అనంతరం భారత​ వాయుసేన పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. మరుసటి రోజు పాక్​ వాయుసేన భారత్​లో వైమానికి దాడికి యత్నించింది. దీంతో ఇరుదేశాల సేనల మధ్య జరిగిన ఘర్షణలో మిగ్​ 21 బైసన్​ కూలిపోయింది. పైలట్​ అభినందన్​ పాక్​కు చిక్కారు. భారత దౌత్య కృషి వల్ల శుక్రవారం వింగ్​ కమాండర్​ వర్థమాన్​ను తిరిగి భారత్​కు అప్పగించింది ఇస్లామాబాద్​.

ABOUT THE AUTHOR

...view details