తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫొని తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు: మోదీ - హిండౌన్​

ఫొని తుపాను ప్రభావిత రాష్ట్రాలకు ముందస్తుగా రూ.1000 కోట్లు విడుదల చేశామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్​ హిండౌన్​ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ... దేశ భద్రత అంశంలో కాంగ్రెస్​ అంతంతమాత్రమేనన్నారు. జైషే అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని పాకిస్థాన్​పై మూడో లక్షిత దాడిగా అభివర్ణించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

By

Published : May 3, 2019, 5:05 PM IST

ఫొని తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించిస్తున్నట్టు తెలిపారు. రాజస్థాన్​ హిండౌన్​ బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ. ఫొని ప్రభావిత రాష్ట్రాలకు తక్షణ సాయంగా రూ.1000కోట్లు అందిచామని ప్రకటించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లోని లక్షల మంది ప్రజలు బీభత్సమైన తుపాను బారిన పడ్డారు. ఒడిశా, బంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఇంతకుముందే అధికారుల నుంచి తాజా సమాచారం తెలుసుకున్నాను. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు ముందుగానే రూ.1000 కోట్లు తక్షణ సాయంగా అందించాం. ఫొని ప్రభావిత రాష్ట్రాలు, అక్కడి ప్రజలకు దేశమంతా తోడుంటుందన్న భరోసా ఇవ్వాలనుకుంటున్నా."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

'కాంగ్రెస్​కు భయం'

ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ భయపడిందని మోదీ విమర్శించారు. వారి పాలనలో వరుసగా ఉగ్రదాడులు జరిగాయని, చర్యలు తీసుకోవటంలో పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. దేశ భద్రత విషయంలోనూ కాంగ్రెస్ అంతంతమాత్రమేనన్నారు. ఎన్నికల వేళ గత ప్రభుత్వం ఐపీఎల్​ మ్యాచ్​లకు భద్రత కల్పించలేక విదేశాలకు తరలించిందన్నారు. ఇప్పుడు దేశంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

'వాళ్లను సంప్రదించాలేమో?'

జైషే మహ్మద్​ చీఫ్​ మసూద్​ అజార్​ దేశానికి అతి పెద్ద శత్రువని, ఎన్నో ఏళ్లుగా దేశంపై దాడి చేస్తూనే ఉన్నాడని మోదీ పేర్కొన్నారు. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని పాకిస్థాన్​పై మూడో లక్షిత దాడిగా అభివర్ణించారు.

మసూద్​ అంశంలో కాంగ్రెస్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఉగ్రవాదిగా ప్రకటించేందుకు 'మేడమ్'​ లేదా 'పేరుగొప్ప వ్యక్తు'లను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలా అంటూ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి: వణికిస్తోన్న ఫొని- ఒడిశా, బంగాల్​లో హై అలర్ట్​

ABOUT THE AUTHOR

...view details