పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని గత మూడేళ్లలో 900 మందికి పైగా విద్యార్థులు ఆనారోగ్యం పాలయ్యారని తెలిపింది కేంద్ర మానవ వనరులశాఖ. అయితే వీరిలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ప్రకటించింది. 2016 నుంచి ఆహార నాణ్యతపై తమకు 35 ఫిర్యాదులు అందాయని పేర్కొంది. సంబంధిత వ్యక్తులపై చర్యలకు ఆదేశాలిచ్చినట్లు స్పష్టం చేసింది.
'3 ఏళ్లలో 900 మంది విద్యార్థులకు అస్వస్థత' - Midday meals
గత మూడేళ్లలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయడం వల్ల 900 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని తెలిపింది కేంద్ర మానవ వనరులశాఖ. వీరిలో అందరూ ప్రాణాలతోనే ఉన్నారని స్పష్టం చేసింది. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభత్వాలను ఆదేశించింది.
నివేదికలను అనుసరించి నాణ్యతలేని ఆహారాన్ని అందించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అలాంటి వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్ చర్యలతో పాటు జరిమానా విధించాలని తెలిపింది. మధ్యాహ్న భోజన పథకానికి విటమిన్లతో కూడిన నాణ్యమైన ఆహారం అందించే విధంగా చూడాలని అధికారులకు స్పష్టం చేసింది.
"అగ్మార్క్ నాణ్యత ఉన్న వస్తువులు, పదార్థాలనే మధ్యాహ్న భోజనానికి వినియోగించాలని, పిల్లలకు భోజనం వడ్డించే ముందు కనీసం ఒక ఉపాధ్యాయుడైనా రుచి చూడాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశాం."
- కేంద్ర మానవ వనరులశాఖ