తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నగరంలో 3వేల మంది కరోనా రోగులు మిస్సింగ్​

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న కర్ణాటక బెంగళూరులో 3 వేల మందికి పైగా కరోనా రోగుల ఆచూకీ గల్లంతవడం కలకలం రేపుతోంది. ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారి జాడ కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

Over-3000-COVID-19-Patients-Untraceable-In-Bengaluru
ఆ నగరంలో 3వేల మంది కరోనా రోగులు మిస్సింగ్​

By

Published : Jul 26, 2020, 4:26 PM IST

కరోనా మహమ్మారి కర్ణాటక రాష్ట్రంలో విజృంభిస్తోంది. ఇక ఐటీ క్యాపిటల్‌ అయిన బెంగళూరులో కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఆందోళన కలిగించే ఇంకో విషయం ఏంటంటే.. ఈ మహానగరంలో కరోనా సోకిన 3వేల మంది జాడ తెలియకపోవడం. ఇప్పుడు ఇదే విషయంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

బెంగళూరు మహానగరంలో గత రెండు వారాల నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 14 రోజుల్లో 16 వేల నుంచి కేసుల సంఖ్య 27 వేలకు చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. అయితే, బెంగళూరులో ఇప్పటి వరకు పాజిటివ్‌గా నిర్ధరణ అయిన 3,338 మంది ఎక్కడున్నారో తెలియడం లేదు.

నగరంలో నమోదైన కేసుల సంఖ్యలో ఇది 7 శాతం కావడం అక్కడి అధికారుల్లో కలవరం తెప్పిస్తోంది. వారి కోసం అధికారులు, పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

"పోలీసుల సాయంతో మేం కొందరిని కనిపెట్టాం. అయితే ఇప్పటికి 3వేల మందికి పైగా ఆచూకీ‌ తెలియడం లేదు. శాంపిళ్ల సేకరణ సమయంలో వీరు తప్పుడు ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇచ్చినట్లు గుర్తించాం" అని బృహణ్‌ బెంగళూరు మహానగర పాలిక కమిషనర్‌ మంజూనాథ్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

ఇక మీదట శాంపిళ్లు సేకరించే సమయంలో ప్రభుత్వం జారీ చేసి ఐడీ కార్డుతోపాటు.. ఫోన్‌ నంబర్లు, చిరునామాలు సరిచూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఇదీ చూడండి: వీడియో: కార్గిల్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details