ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్వ్యాప్తంగా విధించిన ఆంక్షల తొలగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శ్రీనగర్‌లో 190 ప్రాథమిక పాఠశాలలు నేడు పునఃప్రారంభం కానున్నట్లు జమ్ముకశ్మీర్ముఖ్య కార్యదర్శిరోహిత్ కన్సల్ వెల్లడించారు. కశ్మీర్ లోయలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయని స్పష్టం చేశారు.
"శ్రీనగర్ జిల్లాలోనే 190 పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. మౌలిక వనరుల కల్పన, అభివృద్ధి పనుల పునరుద్ధరణతో పరిస్థితులు మరింత మెరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. "
- రోహిత్ కన్సల్,ముఖ్య కార్యదర్శి, జమ్ముకశ్మీర్
ఆదివారం కూడా ఆంక్షల సడలింపును కొనసాగించినట్లు స్పష్టం చేశారు. శనివారం 35 పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో ఆంక్షలను పాక్షికంగా ఎత్తేశామని, ఆదివారం 50 ఠాణాలకు ఈ పరిధిని విస్తరించామని ఆయన కన్సల్ పేర్కొన్నారు. నిషేధాజ్ఞల తొలగింపు సమయాన్ని ఆరు నుంచి ఎనిమిది గంటలకు పెంచామని తెలిపిన ఆయన దుకాణ యజమానులు వారి షాపులను ప్రారంభించుకోవచ్చని ప్రకటించారు.
ల్యాండ్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సాధ్యమైనంత త్వరగా ఫోన్లను వినియోగం లోకి తెస్తామన్నారు. కశ్మీర్‌లోయలో ఫోన్ల సేవలను పునరుద్ధరించేందుకు బీఎస్ఎన్ఎల్ అధికారులు పనిచేస్తున్నారని కన్సల్ ప్రకటించారు.
ఇదీ చూడండి: 'మహాత్ముడి కలల భారతాన్ని నిర్మించామా?