భారత్లో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. వచ్చే ఏడాది జనవరిలోనే తొలి దశ టీకా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన.
'జనవరిలోనే కరోనా వ్యాక్సిన్'
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొవిడ్-19 టీకా.. వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. అయితే.. వ్యాక్సిన్ భద్రత, పనితీరుకే తమ తొలి ప్రాధాన్యమన్నారు.
'టీకా విషయంలో భద్రత, పనితీరుకే తొలి ప్రాధాన్యం'
అయితే.. కొవిడ్-19 టీకా విషయంలో భద్రత, పనితీరుకే తొలి ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు ఆరోగ్య మంత్రి. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి:సీఎంకు నిరసన సెగ- నల్ల జెండాలతో ఆందోళనలు