తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వర్షాకాల సమావేశాల పొడిగింపునకు విపక్షాలు 'నో'! - Om Birla

17వ లోక్​సభ సమావేశాల పొడిగింపునకు విపక్షాలు విముఖత చూపినట్లు సమాచారం. ఇదే విషయాన్ని వివిధ పార్టీల అధినేతలు కేంద్ర మంత్రులకు తెలిపినట్లు తెలుస్తోంది.

వర్షాకాల సమావేశాల పొడిగింపునకు విపక్షాలు 'నో'!

By

Published : Jul 22, 2019, 6:42 PM IST

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల​ సమావేశాల పొడిగింపునకు విపక్ష పార్టీలు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అధ్యక్షతన నేడు జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం(బిజినెస్​ అడ్వైజరీ కమిటీ మీటింగ్​)లో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.

పెండింగ్​లో ఉన్న పలు బిల్లులకు ఆమోదం పొందాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాల్సిన అవసరముందని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను పలు విపక్ష పార్టీల అధినేతలు తిరస్కరించినట్లు సమాచారం.

ఆగస్టు 2 వరకు పొడిగింపు!

జులై 16న మొదలైన 17వ లోక్​సభ తొలి సమావేశాలు జూన్​ 26న ముగుస్తాయి. ప్రస్తుత వర్షాకాల సమావేశాలను ఆగస్టు 2 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details