తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సెన్​గర్​ను భాజపా ఎందుకు బహిష్కరించట్లేదు?' - mayawati

ఉన్నావ్​ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎమ్మెల్యే కుల్​దీప్​ సెన్​గర్​ను పార్టీ నుంచి తొలగించాలని కాంగ్రెస్​ డిమాండ్ చేసింది. నేరస్థులకు అండగా నిలుస్తోందని అధికార పార్టీపై విమర్శలను తీవ్రతరం చేశాయి ప్రతిపక్ష పార్టీలు.

'సెన్​గర్​ను భాజపా ఎందుకు బహిష్కరించట్లేదు'

By

Published : Jul 31, 2019, 5:01 AM IST

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఉన్నావ్ అత్యాచార కేసు నిందితుడు కుల్​దీప్​ సెన్​గర్​ను​ భాజపా ఇంకా ఎందుకు పార్టీ నుంచి తొలగించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సెన్​గర్​కు ఉన్న రాజకీయ అధికారాలు రద్దు చేయాలని ట్విట్టర్​ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు ప్రియాంక.

ప్రియాంక గాంధీ ట్వీట్​

" ఈ నేరస్థుడికి, అతని సోదరుడికి మీ పార్టీలో ఉన్న అన్ని అధికారాలు రద్దు చేయండి ప్రధాని. ఇంకా ఆలస్యమేం కాలేదు. "
-ప్రియాంక గాంధీ ట్వీట్​.

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు కారు ప్రమాద ఘటనకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే కుల్​దీప్​ సెన్​గర్​తో పాటు మరో 8 మందిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.

బాధితురాలి కుటుంబాన్ని సెన్​గర్​ బెదిరించి భయాందోళనకు గురిచేసినట్లు ఎఫ్​ఐర్​లో పేర్కొన్న విషయాన్ని ట్వీట్​లో ట్యాగ్ చేశారు ప్రియాంక.

'నేరస్థులకు భాజపా మద్దతిస్తోంది'

ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితులకు అధికార భాజపా మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు మాయావతి.

మాయవతి ట్వీట్​

"ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎమ్మెల్యేను ఆ పార్టీ ఎంపీ సాక్షి మహరాజ్​ జైలులో కలవడాన్ని చూస్తే.. అధికార పార్టీ నేరస్థులకు ఎల్లవేలలా మద్దతుగా ఉంటోందని అర్థమవుతోంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గ్రహించాలి."
-మాయావతి ట్వీట్​.

యుపీ ప్రభుత్వానిదే బాధ్యత: అఖిలేశ్

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాద ఘటనకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు సమాజ్​వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​. ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న బాధితురాలి కుటుంబ సభ్యులను అఖిలేశ్​ పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details