తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లక్ష్యం సరే... ఆలోచన, ఆచరణ ఏవి?'

భాజపాను ఓడించాలన్నది విపక్ష నేతల లక్ష్యమైనా.... సీట్ల సర్దుబాట్లు, త్యాగాలకు వారు సుముఖంగా లేరని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవం సుధాకర్​ రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రాల్లో కూటముల ఏర్పాటు విఫలమయ్యేందుకు కారణాలు, కాంగ్రెస్​ తీరు, లోక్​సభ ఎన్నికల వ్యూహాలు, నినాదాలను పీటీఐ ముఖాముఖిలో ఆయన వెల్లడించారు.

By

Published : Mar 24, 2019, 5:27 PM IST

Updated : Mar 24, 2019, 5:33 PM IST

ప్రతిపక్షాల వైఖరిపై సురవరం అభిప్రాయాలు

మహాకూటమిలోని పార్టీల నేతల తీరుపై సీబీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్​ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. భాజపాను ఓడించడం విపక్ష నేతలందరి లక్ష్యమైనా... అందుకు అవసరమైన కార్యాచరణను పటిష్ఠంగా అమలుచేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని విమర్శించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ తీరును సురవరం తప్పుబట్టారు.

"సీట్ల పంపకాల అధికారాన్ని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ రాష్ట్ర నేతలకు ఇచ్చేశారు. అందుకే ఇతర పార్టీలతో చర్చలు సఫలం కాలేదు.సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్​ పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయంలో రాహుల్​ గాంధీ రాష్ట్రాల నేతలకు సర్దిచెప్పలేకపోతున్నారు. పొత్తుల అంశంలో రాష్ట్రాల్లో చర్చలు విఫలమవడానికి బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీలు కూడా కారణమే. "
-- సుధాకర్​​ రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

పొత్తులు కుదుర్చుకునేందుకు ఆయా పార్టీల అగ్రనేతలే బాధ్యత తీసుకోవాలని సూచించారు సుధాకర్​ రెడ్డి.

"నేతలు స్థానిక అజెండాలతోనే ముందుకెళుతున్నారు. దూర, విస్తృత దృష్టితో ఆలోచించడం లేదు. ప్రత్యామ్నామ మార్గాలు వెతకడం లేదు. వాళ్లంతా భాజపాకు వ్యతిరేకమే. కానీ సీట్లు త్యాగం చేసేందుకు, సర్దుబాటు చేసుకునేందుకు మాత్రం సిద్ధంగా లేరు.
అన్ని రాష్ట్రాల్లో కూటములు ఏర్పాటు చేసేలా రాహుల్​ గాంధీ ఎన్నికలకు చాలా రోజులు ముందే చర్చించి ఉంటే బాగుండేది."
-- సుధాకర్​​ రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

అదే మా నినాదం...

సీపీఐ దేశంలోని 50 లోక్​సభ స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు సుధాకర్​ రెడ్డి. "మోదీ హఠావో.. దేశ్​ బచావో" తమ ఎన్నికల నినాదమని చెప్పారు.

"జాతీయ స్థాయిలో కూటమి సాధ్యం కాదని ముందే చెప్పాం. రాష్ట్రస్థాయిలో ప్రతిపక్షాల మధ్య కూటములు ఉంటాయని భావించాం. ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, దిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాలేదు. ఇది కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవడమే మార్గం.
భాజపాయేతర, భాజపా వ్యతిరేక పార్టీలు అత్యధిక లోక్​సభ స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని నమ్మకంతో ఉన్నా."
-- సుధాకర్​​ రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

సీపీఐ పొత్తులిలా...

కేరళలో ఎల్​డీఎఫ్​తో, తమిళనాడులో డీఎంకేతో, ఒడిశాలో కాంగ్రెస్​తో, పంజాబ్​తో ఆమ్​ఆద్మీ, బీఎస్పీతో, ఆంధ్రప్రదేశ్​లో జనసేన, సీపీఎంలతో సీపీఐ పొత్తు కుదుర్చుకుంది.

Last Updated : Mar 24, 2019, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details