లోక్‌సభ సమావేశాల్లో భాగంగా సభ ముందుకు ఆధార్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది ప్రభుత్వం. బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్లకు ఆధార్ అనుసంధానానికి చట్టబద్ధత కల్పించేందుకు చేపట్టిన సవరణలను తప్పుబట్టాయి విపక్షాలు. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని విమర్శించారు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. ఎలాంటి కారణం తెలపకుండానే చట్టం చేసేందుకు చర్యలు చేపట్టిందని ఆరోపించారు.
"నేను ఈ ఆర్డినెన్స్‌పై జరిగిన ప్రచారాన్ని పలు సందర్భాల్లో తీవ్రంగా వ్యతిరేకించాను. ఈ సభ విధివిధానాలు చూసినా, కార్యచరణ జాబితా చూసినా... ఈ సర్కారు ఆధార్ ఆర్డినెన్స్‌ను కారణం లేకుండా ఎలా దుర్వినియోగం చేసిందో మీకే తెలుస్తుంది."
- అధిర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత