మన దేశంతో చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి పాలనా యంత్రాంగంపైనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త సరిహద్దులతో నేపాల్ సర్కారు రాజకీయ పటాన్ని విడుదలచేసి వివాదాన్ని తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాయి.
'సానుకూల చర్చల బాధ్యత నేపాల్దే' - bharat on nepal
భారత్తో చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి పైనే ఉందని పేర్కొంది కేంద్రం. కొత్త సరిహద్దులతో నేపాల్ చిత్రపటాన్ని రూపొందించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే నేపాల్ ఈ విధంగా వ్యవహరించినట్లు పేర్కొంది.
'సానుకూల చర్చల బాధ్యత నేపాల్దే'
సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే దశాబ్దాల నాటి వివాదాన్ని తాజాగా తెరపైకి తెచ్చారని ఆరోపించాయి. ఓలి ప్రభుత్వం సమస్య పరిష్కారాన్ని కోరుకోవటంలేదని స్పష్టమవుతోందని, రాజకీయ ప్రయోజనాలను సొంతం చేసుకోవటానికే మొగ్గు చూపినట్లుందని విమర్శించాయి. నేపాల్ సమస్యలపై మన దేశం ఎల్లవేళలా సానుకూల వైఖరితోనే ఉందని ఆ వర్గాలు గుర్తుచేశాయి.