ఆసియాలోనే అతి పెద్ద మురికివాడైన ధారావిలో ఈ రోజు ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ ఒక్క కేసు నమోదవటం ఇదే తొలిసారి. అయితే ఈ రోజు మరణాల సంఖ్యను మాత్రం అధికారులు వెల్లడించలేదు.
ధారావిలో ఇప్పటివరకు 352 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 1,735 మంది కోలుకున్నారు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ 1న తొలి కరోనా కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక్కడ కేసు నమోదైన 20 రోజుల తర్వాత ముంబయిలోని వ్యక్తికి వైరస్ సోకటం గమనార్హం.