తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జోరుగా పోలింగ్ - మూడో వంతు ఓటింగ్​ పూర్తి - పోలింగ్​

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్​లో మూడో వంతు ఓటింగ్​​ పూర్తయింది. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

లైన్లలో ప్రజలు - మూడో వంతు పోలింగ్​ పూర్తి

By

Published : Apr 23, 2019, 3:23 PM IST

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్​లో మూడో వంతు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు వేస్తున్నారు. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ఈ విడతలోని ఓటర్లలో 37.89 శాతం మంది ఓటేశారు.

వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్​ శాతాలు...

  • అసోం: 36.74 %
  • బిహార్​: 37.05 %
  • గోవా: 45.78 %
  • గుజరాత్​: 39.34 %
  • జమ్ముకశ్మీర్​: 9.63 %
  • కర్టాటక: 19.17%
  • కేరళ: 39.89 %
  • మహారాష్ట్ర: 31.99 %
  • ఒడిశా: 32.82 %
  • త్రిపుర: 44.66 %
  • ఉత్తరప్రదేశ్​: 29.76 %
  • బంగాల్​: 52.40%
  • ఛత్తీస్​గఢ్​: 42.97%
  • దాద్రా అండ్​ నాగర్​ హవేలి: 37.20%
  • డమన్​ అండ్​ డియు: 42.99%

క్యూలైన్లో ఇద్దరు మరణం...

కేరళలో ఇద్దరు వృద్ధులు పోలింగ్ కేంద్రంలోనే ప్రాణాలు కోల్పోయారు. వటకార, వడసెరిక్కర నియోజకవర్గాల్లో ఓటింగ్​ కోసం లైన్లో వేచిచూస్తోన్న వృద్ధులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దగ్గరలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ABOUT THE AUTHOR

...view details