జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. క్రల్గుంద్, హంద్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది.
హంద్వారాలో ఎన్కౌంటర్ - క్రల్గుంద్
జమ్ముకశ్మీర్‌లోని క్రల్గుంద్, హంద్వారా ప్రాంతాల్లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. హంద్వారాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఓ ముష్కరుడు హతమయ్యాడు.
హంద్వారాలో ఎన్కౌంటర్
ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో ఈ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు జవాన్లు. ఒక్కసారిగా సైనికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు దీటుగా స్పందించాయి. ఎదురుకాల్పులు జరిపి ఓ ముష్కరుడిని హతమార్చాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.