నిర్భయ కేసు నిందితుల్లో ఒకరైన ముకేశ్ తన మరణ శిక్ష అమలును సవాలు చేస్తూ వేసిన పిటిషన్ నేడు దిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. రాష్ట్రపతి, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నందున మరణ శిక్ష అమలు ఆదేశాలను నిలిపివేయాలని కోరాడు.
క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి లేఖ రాసిన నేపథ్యంలో ఆ పిటిషన్ను తిరస్కరించటానికి కనీసం 14 రోజుల సమయం పడుతుంది. కనుక అప్పటి వరకు మరణశిక్ష అమలును నిలిపివేయాలని కోరాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన చివరి తీర్పు, రాష్ట్రపతి చర్యనుకాని, ప్రతిచర్యనుకాని ప్రశ్నించటం లేదని ముఖేశ్ పిటిషన్లో తెలిపాడు.