తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలా చేస్తే ఉచితంగా విద్యుత్​: కేంద్రమంత్రి

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి భారత్​ సమష్టిగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 745 గిగావాట్ల సౌరవిద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పునరుత్పాదక వనరుల వినియోగం కారణంగా ఏదో ఒక రోజు విద్యుత్​ ఉచితంగా లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

By

Published : Sep 9, 2020, 5:04 PM IST

Piyush Goyal
కేంద్రమంత్రి

స్వచ్ఛ ఇంధన మిషన్​ కోసం భారత్​ సమష్టిగా కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్​ గోయల్​ ఉద్ఘాటించారు. అన్ని శాఖల సమన్వయం, మద్దతుతో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఇంధనాన్ని అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్​ఏ) నిర్వహించిన తొలి ప్రపంచ సౌర సాంకేతిక సదస్సులో గోయల్​ మాట్లాడారు.

"ప్రపంచాన్ని పరిశుభ్రంగా, నివసించేందుకు అనుగుణంగా మార్చేందుకు సౌరశక్తి, కొత్త సాంకేతికతలు కచ్చితంగా శక్తినిస్తాయి. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన జీవితం అందించటం మన బాధ్యత. 745 గిగా వాట్ల సౌర విద్యుత్​ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని భారత్​ అందిపుచ్చుకోగలదు. దీనితో ప్రపంచానికీ విద్యుత్​ సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రోజు మనకు విద్యుత్​ ఉచితంగా లభిస్తుంది."

- పీయూష్ గోయల్​

సూర్యుడు, గాలి, నీళ్లు మనకు నిత్యం అందుబాటులో ఉంటాయని.. ఈ వనరులను పుష్కలంగా వినియోగించుకోవాలని సూచించారు పీయూష్​. ఈ సందర్భంగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ను అభినందించారు. ఆయన చొరవతో శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక శక్తి వినియోగానికి భారత్​ వేగంగా రూపాంతరం చెందుతోందని కొనియాడారు.

ఇదీ చూడండి:'స్వచ్ఛ ఇంధనంపై జీ-20 దృష్టి సారించాలి'

ABOUT THE AUTHOR

...view details