దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. మహమ్మారినుంచి దేశాన్ని రక్షించేందుకు స్వచ్ఛంద కర్ఫ్యూకు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీనికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంఘీభావం ప్రకటించాయి.
'దేశాన్ని కాపాడదాం.. కరోనాను అరికడదాం' అంటూ సెలబ్రిటీలు సైతం తమ వీడియోల ద్వారా ప్రజలకు జనతా కర్ఫ్యూపై అవగాహన కల్పిస్తున్నారు. కర్ఫ్యూలో భాగంగా ముందస్తుగా ఇప్పటికే ఆయా రాష్ట్రాలు రవాణా సేవలను మూసివేస్తిన్నట్లు ప్రకటించాయి.
బిగ్‌బీ ఏమన్నారంటే..?
ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రజలకు బాలీవుడ్ ప్రముఖులు పిలుపునిచ్చారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అనిల్ కపూర్ కర్ఫ్యూను విజయవంతం చేయాలని కోరారు. అమితాబ్ బచ్చన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా కర్ఫ్యూను పాటిస్తానని.. సాయంత్రం 5 గంటలకు కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు చెబుతూ శంఖాన్ని పూరిస్తానని చెప్పారు.
తెలంగాణలో 24 గంటలు..
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దామని చెప్పారు. రేపు ఆర్టీసీ బస్సు సేవలను రద్దు చేస్తున్నామని, మెట్రో సేవలు సైతం మూసివేస్తున్నామని చెప్పారు. అంతర్రాష్ట్ర బస్సులను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
5జిల్లాల మూసివేత..