తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2019, 7:10 AM IST

ETV Bharat / bharat

మావోల ఘాతుకం : ఎన్నికల అధికారిణి హత్య

ఒడిశా కందమాల్​ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. ఎన్నికల విధుల కోసం వెళుతున్న అధికారిణిని కాల్చి చంపారు. మరో చోట ఈవీఎంలను తీసుకెళుతున్న మూడు వాహనాలకు నిప్పు పెట్టారు.

మందుపాతర ధాటికి ఎగిరిపడిన వాహనం

ఒడిశాలోని కందమాల్ జిల్లాలో దారుణం జరిగింది. ఒడిశాలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధుల కోసం వెళుతున్న అధికారిణి సంజుక్త దిగల్ లక్ష్యంగా మావోలు మందుపాతర పేల్చారు. పేలుడు నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు. అయినా, మావోలు ఆమెపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆమె మృతి చెందారు. సంజుక్తతో పాటు ప్రయాణిస్తున్న మిగతా అధికారులు క్షేమంగా బయటపడ్డారు.

అధికారిణి మృతి పట్ల ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు.

నవీన్ పట్నాయక్ ట్వీట్

"మావోల దాడిలో ఎన్నికల పర్యవేక్షకురాలు సంజుక్త దిగల్ మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. " -నవీన్ పట్నాయక్

వాహనాలకు నిప్పు...

మరో ఘటనలో పోలింగ్ సామగ్రిని తీసుకెళుతున్న మూడు వాహనాలను మావోయిస్టులు కాల్చేశారు. ఇందులో రెండు కార్లు కాగా ఒక మోటర్ సైకిల్ ఉంది. ఈ వాహనాల్లో 13మంది అధికారులు ప్రయాణిస్తున్నారు. అధికారులను కిందికి దించి వాహనాలకు నిప్పంటించారు నక్సల్స్.

ఒడిశాలోని బర్​గఢ్, సుందర్​గఢ్, బోలంగిర్, కందమాల్, అస్​కా లోక్​సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details