తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిర్భయ' ధర్మాసనం నుంచి తప్పుకున్న సీజేఐ - Chief Justice S A Bobde recused himself on Tuesday from hearing the plea of convict Akshay Kumar Singh

number-nirbhaya-rape-case-three-judge-bench-of-the-supreme-court-headed-by-chief-justice-sharad-arvind-bobde
'నిర్భయ' ధర్మాసనం నుంచి తప్పుకున్న సీజేఐ

By

Published : Dec 17, 2019, 2:32 PM IST

Updated : Dec 17, 2019, 3:14 PM IST

14:24 December 17

'నిర్భయ' దోషి రివ్యూ పిటిషన్​పై విచారణ వాయిదా

నిర్భయ కేసు దోషికి మరణశిక్ష విధించడంపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణను వాయిదా చేసింది సుప్రీం కోర్టు. ఈ కేసును విచారించే ధర్మాసనం నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే స్వయంగా తప్పుకోవడమే ఇందుకు కారణం. వ్యక్తిగత కారణాలతోనే బెంచ్​ నుంచి తప్పుకున్నట్లు స్పష్టంచేశారు జస్టిస్​ బోబ్డే. బుధవారం ఉదయం 10. 30 గంటలకు వేరొక విస్తృత ధర్మాసనం.. దోషి పిటిషన్​పై విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు. 

తమ బంధువుల్లో ఒకరు గతంలో బాధితురాలి తల్లి తరఫున వాదించారని... అందుకే వేరొక ధర్మాసనం విచారణ జరపడమే సముచితమని అభిప్రాయపడ్డారు జస్టిస్​ బోబ్డే. 

దోషికి అన్యాయం!

కేసులో అక్షయ్​ తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్​.. ఈ కేసు రాజకీయ, మీడియా ఒత్తిళ్లకు గురైందని సుప్రీంకు తెలిపారు. దోషికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.   

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్​ కాగా.... మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన దోషులైన ముకేశ్​, పవన్​ గుప్తా, వినయ్​ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్​ కుమార్ సింగ్​.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు. 

Last Updated : Dec 17, 2019, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details