తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డోభాల్​ను ప్రశ్నించిన కశ్మీర్​ గొర్రెల కాపరి - అనంత్​నాగ్

కశ్మీర్​లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు జాతీయ భద్రతా సలహాదారు అనంత్​నాగ్​లో పర్యటించారు. స్థానికులు, గొర్రెల వ్యాపారులతో కాసేపు ముచ్చటిస్తుండగా ఆయనను ఓ యువకుడు ఆసక్తికర ప్రశ్న అడిగాడు.

డోభాల్

By

Published : Aug 10, 2019, 5:59 PM IST

అధికరణ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్​లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం షోపియాన్​లో స్థానికులతో మాట్లాడిన డోభాల్​ తాజాగా అనంత్​నాగ్​ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు.

రోడ్డుపై వెళుతుండగా గొర్రెల వ్యాపారులను చూసి, ఆగి వారితో కాసేపు ముచ్చటించారు డోభాల్​. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఓ యువకుడిని అడిగారు డోభాల్​. అందుకు సమాధానంగా కార్గిల్​, ద్రాస్​ నుంచి తీసుకొచ్చాం అని చెప్పిన అతను.. మీకు ద్రాస్​ ఎక్కడ ఉంటుందో తెలుసా? అని డోభాల్​ను తిరిగి ప్రశ్నించాడు.

డోభాల్

అనంత్‌నాగ్‌ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఖలీద్‌ జనగిర్‌ కలగజేసుకొని డోభాల్‌ గురించి అతనికి వివరించారు. తర్వాత కరచాలనం చేసి డోభాల్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదీ చూడండి: జమ్ములో సాధారణ స్థితికి జనజీవనం

ABOUT THE AUTHOR

...view details