తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో తాజా పరిణామాలపై షాతో డోభాల్​ భేటీ

కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన అజిత్​ డోభాల్​ జమ్ముకశ్మీర్​ తాజా పరిస్థితులను వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు.

కశ్మీర్​లో తాజా పరిణామాలపై షాతో డోభాల్​ భేటీ

By

Published : Aug 19, 2019, 5:21 PM IST

Updated : Sep 27, 2019, 1:15 PM IST

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో సమావేశమయ్యారు. జమ్ముకశ్మీర్​లో నెలకొన్న తాజా పరిస్థితులు, భద్రతా పరిణామాలను అమిత్​ షాకు వివరించారు.

జమ్ముకశ్మీర్​లో 10 రోజులు పర్యటించిన అనంతరం అమిత్​ షాను డోభాల్​ కలవడం ఇదే తొలిసారి.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్​ గౌబా సహా ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్​లో శాంతి భద్రత పరిస్థితులపై చర్చలు జరిపారు. అనేక ప్రాంతాల్లో విధించిన ఆంక్షల వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి సమాలోచన చేశారు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని కేంద్ర ప్రభుత్వ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ విధించిన ఆంక్షలను క్రమక్రంమంగా సడలిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి:- ఆలస్యమైనా... ఆర్థిక మాంద్యం తధ్యం..!

Last Updated : Sep 27, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details