ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సెక్రటరీలుగా పాత అధికారులనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్ నియామకాల కమిటీ. ప్రిన్సిపల్ సెక్రటరీగా నృపేంద్ర మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోద్ కుమార్ మిశ్రాను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.
మే 31 నుంచే వీరి నియామకం అమలు వర్తిస్తుందని అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. మోదీ పదవిలో ఉన్నంతకాలం వారు బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొంది.