తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలు చేస్తాం: రాజ్​నాథ్​

జాతీయ పౌరసత్వ జాబితాను దేశమంతా  అమలు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. దేశంలో విదేశీయులు ఎవరన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. అయోధ్య గడ్డపై రామమందిరాన్ని ఘనంగా నిర్మిస్తామన్నారు రాజ్​నాథ్​.

nrc-to-be-implemented-pan-india
దేశ వ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలు చేస్తాం: రాజ్​నాథ్​

By

Published : Dec 1, 2019, 4:32 PM IST

Updated : Dec 1, 2019, 6:00 PM IST

దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలు చేస్తాం: రాజ్​నాథ్​

దేశంలో విదేశీయులెవరో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా? అని ప్రశ్నించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. అందుకే జాతీయ పౌరసత్వ జాబితాను అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎంతమంది విదేశీయులు ఉన్నారు, వీరంతా ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలుసుకోవచ్చని రాజ్​నాథ్​ చెప్పారు. ఝార్ఖండ్‌ ఉక్కు నగరం బొకారోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాతి, మతాల ప్రాతిపదికన భాజపా భేదభావం సృష్టిస్తుందని కొంతమంది చేస్తున్న విమర్శలు సరికాదన్నారు.

ఏ శక్తి ఆపలేదు

అయోధ్య గడ్డపై, ఎక్కడైతే రాముడు జన్మించాడో అక్కడ ఘనమైన మందిరాన్ని నిర్మించడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదన్నారు రాజ్​నాథ్​.

ఇదీ చూడండి: 'అయోధ్య ముగిసిన అధ్యాయం.. రివ్యూ పిటిషన్​ ఎందుకు?'

Last Updated : Dec 1, 2019, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details